హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, ఢిల్లీకి చెందిన కాంగ్రెసు నాయకులకు శుక్రవారం విందు ఇచ్చారు. పార్టీ సమన్వయ కమిటీ, ఎన్నికల ప్రణాళిక అమలు కమిటీ సమావేశాలు జరుగనున్న తరుణంలో ఆయన ఈ మధ్యాహ్న భోజన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీనివాస్ ఇచ్చిన విందుకు రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, నాయకులు జాఫర్ షరీఫ్, మాథుర్ హాజరయ్యారు. కొద్ది మంది మంత్రులు కూడా ఈ విందుకు వచ్చారు.