హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీ వేత్త నాగభైరవ కోటేశ్వరరావు (77) మరణించారు. ఆయన గత కొంత కాలంగా అస్వస్ధులుగా ఉన్నారు. నాగబైరవ స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతల. నాగభైరవ అనేక రచనలు చేశారు. ఆయన రచించిన రంగాజమ్మ, కవన విజయం, గుండ్లకమ్మ చెప్పిన కథలు, తూర్పు వాకిళ్ళు, ఒయాసిస్, కన్నీటి గాధ తదితర రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి.