మరో ఐదు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు జిల్లాలకు విస్తరించనున్నది. హైదరాబాద్, ఆదిలాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పథకాన్ని వచ్చే నెల 17వ తేదీన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు ఈ పథకాన్ని 13 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న జిల్లాల్లో తెల్ల రేషన్ కార్డులున్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు అందవని, గులాబీ రేషన్ కార్డులున్నవారికి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications