చిరు పార్టీ పెట్టకుండా మాట్లాడ: బాబు

Chandrababu Naidu
విజయనగరం: మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టకుండా ఆ పార్టీపై తాను మాట్లాడబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు మీ కోసం చైతన్యయాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో జరిగింది. తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీకి ఉన్న పటిష్టమైన క్యాడర్ మరే పార్టీకి లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిది తుగ్లక్ పాలన అని ఆయన వ్యాఖ్యానించారు.

తన మీకోసం యాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. జిల్లాలో తన యాత్ర నిర్దిష్టమైన ప్రణాళిక సాగుతోందని ఆయన చెప్పారు. ఈ జిల్లాలో ఎక్కువ సమయం గడపాల్సి వుందని, ఇక్కడ పేదలు ఎక్కువగా ఉన్నారని, వారి సమస్యలను తెలుసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తన యాత్ర ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+