న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అంబికా సోనీతో గురువారం ఉదయం ఇక్కడ సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై చర్చించారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంపై చొరరవ తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై తమ వంతు అధ్యయానాలు పూర్తై ఫైలు తయారయిందని ఆమె రాజశేఖరరెడ్డికి చెప్పారు. జులై నెలాఖరులోగా ఈ ఫైలును ప్రధానికి అందజేస్తామని చెప్పారు.