హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధమేనని, ఒంటరిపోరు తమకు కొత్తకాదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయంలో పాత మిత్రులకు ఇప్పటికీ తలుపులు తెరచే ఉంటాయని, కలిసివస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీతో మినహా ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్దమేనని డీఎస్ తెలిపారు. అయితే చిరంజీవి రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ ఒంటరిపోరుకు జంకదని డీఎస్ స్పష్టం చేశారు.