న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ రోజు ఉన్న అపాయింట్ మెంట్ రద్దయింది. షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రం వైఎస్ ప్రధాన మంత్రితో సమావేశం కావలసి ఉంది. ప్రధాని హఠాత్తుగా అస్వస్ధులు కావడంతో గురువారం ఉదయం నుంచి ఆయన అపాయింట్ మెట్లు రద్దయ్యాయి. వీటిలో భాగంగా వైఎస్ అపాయింట్ మెంట్ కూడా రద్దయింది.