చట్ట ప్రకారమే శ్రీనివాస్ అరెస్టు: డిసిపి
హైదరాబాద్: చట్టప్రకారమే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ ను, మరో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశామని డిసిపి రవివర్మ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం పరిదిలోకి కేసు వస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే జర్నలిస్టులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఎడిటోరియల్ ముగిసిన తర్వాత అరెస్టు చేయాలని ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం కోరిందని, ఆ కోరిక మేరకే వారిని రాత్రి అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఫొటోల ఆధారంగానే జర్నలిస్టులపై కేసు పెట్టామని, వారిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తామని అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగపై కేసు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications