నక్సల్స్ దాడి: 20 మంది గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్ లో లాంచీలపై వెళ్తున్న పోలీసులపై మావోయిస్టులు ఆదివారంనాడు దాడి చేశారు. దీంతో 64 మంది రిజర్వాయర్లో మునిగిపోయారు. వీరిలో 34 మందిని ప్రత్యేక బృందాలు బయటకు తీశాయి. మరో 30 మంది గల్లంతయ్యారు. ఒరిస్సా సాయుధ బలగాల పోలీసులు, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ బలగాల పోలీసులు బోటులో వెళ్తుండగా మావోయిస్టులు ఆలంపేట వద్ద దాడి చేశారు.
మావోయిస్టులు బోటు డ్రైవరును కాల్చి చంపారు. దీంతో పడవతో పాటు పోలీసులు రిజర్వాయరులో మునిగిపోయారు. గల్లంతయినవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను హైదరాబాదు నుంచి సంఘటనా స్థలానికి పంపారు. ఎన్ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని హైదరాబాదులో హోంమంత్రి కె. జానారెడ్డి సమీక్షించారు. ఉన్నతాధికారులు కూడా పరిస్థితిని సమీక్షించారు. లాంచీల్లో బలిమెల రిజర్యాయరును పోలీసులు దాటుతుండగా ఈ దాడి జరిగింది.












Click it and Unblock the Notifications
