ప్రభుత్వానిది పచ్చి మోసం: లెఫ్ట్
న్యూఢిల్లీ: పార్లమెంటులో విశ్వాస తీర్మానంపై నెగ్గకుండా భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఎఐఇఎ)కు వెళ్లడంపై వామపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. దేశానికి ఇచ్చిన వాగ్దానం విషయంలో ప్రభుత్వం దిగ్భ్రాంతికరమైన మోసం చేసిందని వ్యాఖ్యానించాయి. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేయాలో తమకు తెలుసునని, ఒప్పందంపై ముందుకు సాగకుండా రాజకీయంగా అడ్డుకుంటామని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ చెప్పారు.
ప్రభుత్వం మైనారిటీలో పడిన తర్వాత ఐఎఇఎ భద్రతా ప్రమాణాల పత్రాన్ని ఎలా విడుదల చేశారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ విమర్శించారు. విశ్వాస తీర్మానం ప్రతిపాదించి నెగ్గిన తర్వాతనే ఐఎఇఎకు వెళ్తామని రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని, అలా కాకుండా ఎందుకు ముందుకు సాగినట్లని ఆయన అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన భద్రతా ప్రమాణాల పత్రాన్ని కూలంకషంగా చదివి తమ అభిప్రాయం చెప్తామని కారత్ చెప్పారు. తాము అడిగితే రహస్య పత్రమని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడెలా ఐఎఇఎ దాన్ని విడుదల చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
