విజయవాడ: తాను ప్రేమలో పడ్డానని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. విజయవాడలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రేమలో పడిన మాట వాస్తవమేనని, అయితే తాను ప్రేమికురాలు విజయవాడ అమ్మాయి మాత్రం కాదని ఆయన అన్నారు. తాను ఎవరిని ప్రేమించాననే విషయం చెప్పబోనని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీకి తాను ముందుండి ప్రచారం చేస్తానని అల్లు అర్జున్ చెప్పారు. ఆర్య-2 సినిమాలో నటిస్తానని ఆయన చెప్పారు.