ఎన్డీయేతోనే శిరోమణి అకాలీదళ్
న్యూఢిల్లీ: అణు ఒప్పందం అంశంపై తాము బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ)తోనే ఉంటామని శిరోమణి అకాళీదళ్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ చెప్పారు. అణు ఒప్పందంపై యుపిఎ ప్రతిపాదించే విశ్వాస తీర్మానం విషయంలో తాము ఎన్డీఎతోనే ఉంటామని చెప్పారు. ఎన్డీఎ తీసుకునే నిర్ణయాలన్నింటినీ అంగీకరిస్తామని ఆయన చెప్పారు.
మొత్తం విషయంపై ఈ నెల 15వ తేదీన జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శిరోమణి అకాలీదళ్ సభ్యులు లోకసభలో 8 మంది ఉన్నారు. తాము అణు ఒప్పందానికి అనుకూలంగానే ఉన్నామని, అయితే అంత మాత్రాన యుపిఎకు అనుకూలంగా ఓటు చేస్తామని కాదని పార్టీ ప్రధాన కార్యదర్శి సుఖదేవ్ సింగ్ థింసా అన్నారు. వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మన్మోహన్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, అందు వల్ల బలపరీక్షకు సిద్ధపడాలని పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ కూడా అయిన థింసా అన్నారు.












Click it and Unblock the Notifications
