స్పీకర్ కొనసాగే అవకాశం

Somnath Chatterjee
న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ పదవికి సోమనాథ్ ఛటర్జీ రాజీనామా చేసే అవకాశం లేదు. ఆయన గురువారంనాడు తన కార్యాలయానికి వచ్చారు. తాను ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఊహాగానాలతో అత్యున్నతమైన చట్టసభ కార్యాలయాన్ని వివాదంలోకి లాగవద్దని ఆయన మీడియాను కోరారు.

సిపిఎం యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో స్పీకర్ పదవిపై వస్తున్న వార్తలపై స్పీకర్ సెక్రటేరియట్ ఒక ప్రకటనను విడుదల చేసింది. స్పీకర్ తన విధుల నిర్వహణలో, కార్యకలాపాల్లో ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రాతినిధ్యం వహించబోరని, ప్రస్తుత స్పీకర్ ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందని, అన్ని పార్టీలు ఒకే పేరును సూచించడం వల్ల ఎంపికయ్యారని, ఒక పార్టీ అభ్యర్థిగా స్పీకర్ పదవిని గెలుచుకోలేదని ఆ ప్రకటనలో అన్నారు. స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తనను తాను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని కూడా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+