తెలంగాణపై మాటిస్తే మద్దతు: కెటిఆర్
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఊహాలోకంలో ఉన్నారని తెరాస ప్రధాన కార్యదర్శి కె. తారక రామారావు అన్నారు. కెసిఆర్ తమకు మద్దతిస్తారనే డి. శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఆయన గురువారం హైదరాబాదులో ఆ విధంగా అన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసే సమయం ఇదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించకపోతే తాము యుపిఎకు మద్దతివ్వబోమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రధాని ప్రకటించకపోతే యుపిఎను కూల్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై చిరంజీవి ప్రజల మనోభావాలను మరో సారి తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రజలు ఇప్పటికే చాలా సార్లువెల్లడించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
