అదంతా ఓ కుట్ర: దామోదర్ రెడ్డి
హైదరాబాద్: తాను ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితోనే ఉంటానని రాష్ట్ర ఐటి మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నదే రాజశేఖర రెడ్డి కోసమని, రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను రాజశేఖరరెడ్డితోనే ఉంటానని ఆయన శుక్రవారం చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తాను కాంగ్రెసును వీడుతున్నట్లు కొంతమంది గిట్టనివాళ్లు కావాలని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
తాను పార్టీని వీడుతున్నట్లు ఓ టీవీ చానెల్ కుట్ర చేసిందని ఆయన విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అయితే ఆయన నల్లగొండ రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పురుషోత్తమరెడ్డితో విభేదాలు ఉండడమే కాకుండా కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా పని చేస్తుండడంపై ఆయన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడిగా నేతి విద్యాసాగర్ ను చేయాలనే జైపాల్ రెడ్డి ప్రయత్నం దామోదర్ రెడ్డికి రుచించడం లేదని అంటున్నారు. అలాగే, 2004లోనే తనకు మంత్రి వర్గంలో చోటు లభించాల్సి ఉండాల్సిందని, అయితే జైపాల్ రెడ్డి తనకు చాలా ఆలస్యంగా మంత్రి పదవి లభించిందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాగా, దామోదర్ రెడ్డి అనుచరులంతా చిరంజీవి అభిమానులు. దీంతో చిరంజీవి పార్టీలో చేరాలని దామోదర్ రెడ్డిపై ఒత్తిడి కూడా పెరుగుతోంది.












Click it and Unblock the Notifications