యోధుల త్యాగాలే స్ఫూర్తి: డిఎస్
హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు స్ఫూర్తి కావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఆయన శుక్రవారం జాతీయ జెండాను అవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనంతపురంలో జాతీయ పతాకను ఆవిష్కరించారు. మీ కోసం యాత్ర సందర్భంగా ఆయన అనంతపురంలో ఉన్న విషయం తెలిసిందే. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకను అవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఈ సందర్భంగా విమర్శలు చేశారు.
శాసనసభ ఆవరణలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి జాతీయ పతాకను ఆవిష్కరించారు. శాంతిసామరస్యాల కోసం మనమంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యతకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ జాతీయ పతాకను ఆవిష్కరించారు. దేశానికంతా స్వాతంత్ర్యం లభించినా ఆ ఫలాలు తెలంగాణకు ఇంకా అందలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications