చిరు ఆహ్వానం లేదు: దామోదర్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నుంచి తనకు ఆహ్వానం రాలేదని ఐటి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చెప్పారు. తన అనుచరులు చిరంజీవి అభిమానులు కారని, వారంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆయన అన్నారు. తాను పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి చెప్పే వెళ్తానని ఆయన అన్నారు. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన అనుచర గణం శుక్రవారం భగ్గుమంది.
నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల ధర్నాలకు, ప్రదర్శనలకు దిగారు. సూర్యాపేటలోని ఈనాడు పత్రికా కార్యాలయంపై దాడి చేశారు. దామోదర్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని పార్టీ వ్యవహారాలతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తొలుత ఈటీవీలో వార్త వచ్చింది. అయితే వెంటనే ఆ వార్తను దామోదర్ రెడ్డి ఖండించారు. తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అనుచరులు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications