హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు హరిప్రసాద్ (44)ఆదివారం గుండెపోటుతో మరణించారు.ఆయన కొద్దిరోజులుగు ఒబిసిటీ,రక్తపోటులతో బాధ పడుతూ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన చిరంజీవికి చాలా సన్నిహితులు. చిరు రాజకీయ రంగ ప్రవేశంపే ఆదిరారం రాత్రి టీవీ 9 ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ హఠాత్తుగా కుప్పుకూలారు. వెంటనే హుటాహుటిన బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్తికి తరలించారు. ఆయన మరణించినట్లు రాత్రి పది గంటలకు డాక్టర్లు నిర్ధారించారు. దాసరి 'శిరరంజని' ద్వారా హీరో అయిన హరిప్రసాద్ ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నారు.