ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలు- వారి ఖాతాల్లో రూ 10 వేలు, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుస గా అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే నాలుగు పథకాలు అమల్లోకి వచ్చాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన పెన్షన్లను ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన హామీల అమలు పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మరో పథకం అమలు దిశగా ప్రకటన చేసారు. దీని ద్వారా ఇక అర్హుల ఖాతాల్లో రూ 10 వేలు జమ కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు తీపి కబురు అందించింది. గతంలో వారికి ఇచ్చిన ఆర్దిక తోడ్పాటు రెట్టింపు చేసి అమలు చేస్తామని గతంలో నే కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు ఆర్థికం గా నిలదొక్కుకునేందుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5,000 స్టైఫండ్‌ను ఏకంగా రూ.10,000కు పెంచుతున్నట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఈ స్టైఫండ్ పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రం లో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీవ్యాప్తంగా కొత్తగా 96 కోర్టులను మంజూరు చేసామని గుర్తు చేసారు. న్యాయ శాఖలో ఖాళీగా ఉన్న 1,770 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.

ap-govt-hikes-junior-lawyers-monthly-stipend-from-5-000-to-10-000-as-election-promise-here-the-d

కర్నూలు లో హైకోర్టు బెంచ్

కాగా, రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవనాలు, జడ్జిల క్వార్టర్లు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణంతో పాటుగా ఆధునీక రణ కోసం రూ.216 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. అదే విధంగా న్యాయశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచగా, హైకోర్టు న్యాయమూర్తు ల గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. వీటితో పాటు హైకోర్టు ఏజీపీల గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచుతూ, స్పెషల్ జ్యుడిషియరీ మేజిస్ట్రేట్‌ల వేతనాన్ని రూ.30,000 నుంచి రూ.45,000కు పెంచారు. వీరికి అదనంగా నెలకు రూ.5,000 చొప్పున ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది గుర్తు చేసారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన ప్రక్రియ కొనసాగుతుందని త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+