ప్రతీ సంఘటనలో.. ప్రతీ సంఘర్షణలో - సీఎం రేవంత్ ఎమోషనల్..!!
ముఖ్యమంత్రి రేవంత్ ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపార మైన బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతీ సంఘటనలో... ప్రతీ సంఘర్షణలో తనతో పాటుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ సీఎం ధన్యవాదాలు చెప్పారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మిడ్గిల్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. లక్షల అక్షరాలతో రాసినా... కోట్ల పదాలను కూర్చి చెప్పినా... తరగని మధుర జ్ఞాపకం... ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితమని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో తన రాజకీయ ప్రస్థానం ఆరంభం గురించి ప్రస్తావించారు.

'నాడు మిడ్జిల్‌లో రేవంత్‌రెడ్డిగా మొదలై... నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు..అని పేర్కొన్నారు.
మిడ్గిల్ కు రేవంత్
కాగా.. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా... అన్నింటికీ మించి రేవంతన్నగా... మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను' అని సీఎం రేవంత్‌రెడ్డి తన ట్వీట్ లో స్పష్టం చేసారు. ఇక, తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు రేవంత్ డి మిడ్జిల్‌కు వెళ్లనున్నారు.
లక్షల అక్షరాలతో రాసినా…
— Revanth Reddy (@revanth_anumula) July 4, 2026
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి… pic.twitter.com/cVyPl4rvJp
అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా పలు అభివృద్ధి పనులకూ శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో మాటామంతీ జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications