బాలకృష్ణ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలివే.. కారణాలు ఏంటంటే ??

నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సమపాదించుకున్నారు. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.

ఇప్పటికే ఈ ఏడాది "అఖండ 2" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' మంచి హిట్ అందుకుంది. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

nandamuri-balakrishna-movies-which-are-stopped-due-to-several-reasons-after-announcement-and-reasons

అలానే తన నెక్స్ట్ చిత్రాన్ని డైరెక్టర్ కొరత శివతో కమిట్ అయ్యారు బాలయ్య. ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేవర వంటి భారీ హిట్ చిత్రం తర్వాత కొరటాల దర్శకత్వంలో మూవీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా NBK112 (వర్కింగ్ టైటిల్)తో రాబోతున్న ఈ మూవీ రీసెంట్ గానే అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే బాలయ్య సినీ కెరీర్ లో పలు కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఆగిపోయిన చిత్రాలు ఇవే..

నటరత్న..

1986లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా 'నటరత్న' అనే వైవిధ్యమైన టైటిల్‌తో పత్రికల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, నిర్మాత జి. సుబ్బారావు కాంబోలో అమెరికా వేదికగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు చిత్ర బృందానికి వీసాలు రావడంలో తీవ్ర ఆలస్యమైంది. దీంతో ఆ తర్వాత బాలయ్య డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

శపథం..

'బాబాయ్ అబ్బాయ్' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ పర్యవేక్షణలో 'శపథం' అనే సినిమాను ప్లాన్ చేశారు. అప్పట్లో టాలీవుడ్‌లో 3D చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ ట్రెండ్‌ను అందుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా కథను కూడా సిద్ధం చేశారు. కానీ ఊహించని సాంకేతిక, వ్యక్తిగత కారణాల వల్ల క్లాప్ కొట్టే లోపే ఈ క్రేజీ 3D ప్రాజెక్ట్ మూలన పడింది.

బాలకృష్ణుడు..

'అశోక చక్రవర్తి' సినిమాను నిర్మించిన కోగంటి హరికృష్ణ, ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా 'బాలకృష్ణుడు' అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో బాలయ్య నటించిన 'అశోక చక్రవర్తి', వెంకటేష్ నటించిన 'ధ్రువ నక్షత్రం' సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వచ్చాయి. ఆ రెండు చిత్రాల కథాంశాలు దాదాపు ఒకేలా ఉండటంతో బాలకృష్ణ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హరికృష్ణతో చేయాల్సిన 'బాలకృష్ణుడు' ప్రాజెక్ట్‌ను ఆయన రద్దు చేసుకున్నారు.

కమాండో..

2002లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభమైంది. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించగా, వి. సముద్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మార్చి 8న అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, కొద్దిరోజుల షూటింగ్ జరుపుకున్నాక అంతర్గత కారణాలతో ముందుకు సాగలేదు.

విక్రమసింహ భూపతి..

భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యతో 'విక్రమసింహ భూపతి' అనే పీరియాడిక్ జానపద చిత్రాన్ని ప్రారంభించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజుగా, యోధుడిగా ద్విపాత్రాభినయం చేశారు. రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఆ సమయంలో హీరో, నిర్మాత మధ్య తలెత్తిన కొన్ని అభిప్రాయభేదాల కారణంగా ఆగిపోయింది.

నర్తనశాల..

ఎన్టీఆర్ క్లాసిక్ మూవీ 'నర్తనశాల'ను అదే పేరుతో రీమేక్ చేస్తూ బాలయ్యే స్వయంగా మెగాఫోన్ పట్టారు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి, ద్రౌపదిగా సౌందర్య ఎంపికయ్యారు. వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా షూటింగ్ కూడా సాగింది. అయితే ఆ వెంటనే బాలకృష్ణ ప్రమాదానికి గురికావడం, మరోవైపు సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

హర హర మహాదేవ..

బి. గోపాల్‌-బాలయ్య కాంబినేషన్‌లో 2011లో 'హర హర మహాదేవ' చిత్రం అనౌన్స్ అయింది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఆ సమయంలో బాలకృష్ణ నివాసంలో జరిగిన ఒక కాల్పుల వివాదం కారణంగా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లకుండానే మూతపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+