నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు
ఖాట్మండ్: మావోయిస్టు నేత ప్రచండ సోమవారం నేపాల్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ప్రచండ విజయం సాధించారు. తాను దేశానికి, దేశప్రజలకు విశ్వాసపాత్రుడిగా మెలుగుతానని ప్రచండ తన ప్రతిజ్ఞలో చెప్పారు. నేపాల్ సార్వభౌమత్వానికి ప్రజల పేరిట విశ్వాసపాత్రుడనై వ్యవహరిస్తానని ఆయన చెప్పారు.
నేపాల్ లో రాచరిక పాలన అంతానికి సాయుధ పోరాటం నిర్వహించిన మావోయిస్టులు ఆ తర్వాత ఆయుధాలను విసర్జించి ఎన్నికల బాట పట్టారు. ఈ ఎన్నికల్లో మావోయిస్టులు మంచి మెజారిటీ సాధించడమే గాక మావోయిస్టుల నేత ప్రచండ ప్రధానిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications