వివాదంలో చిరు ప్రజారాజ్యం

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం వివాదంలో పడింది. ఈ పేరుతో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన చెన్నక్రిష్ణయ్య అనే న్యాయవాది పార్టీని రిజిష్టర్ చేయించారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినట్లు చిరంజీవి బహిరంగసభకు ఒక రోజు ముందు ఈ నెల 25వ తేదీన వార్త వచ్చేట్లు చూసుకుని ఆ న్యాయవాది కనిపించకుండా పోయాడు.

దీంతో ఒక్కసారిగా గురువారం రాత్రి నుంచి కలకలం మొదలైంది. ప్రజారాజ్యం పేర పార్టీ రిజిష్టర్ కోసం చెన్నక్రిష్ణయ్య ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దానికి అవసరమైన పత్రాలు పంపాలని ఈ నెల 13వ తేదీన చెన్న క్రిష్ణయ్యకు ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చినట్లు సమాచారం. చెన్నక్రిష్ణయకు తాము సమాధానం రాశామని చెప్పిన ఎన్నికల సంఘం ఏం సమాధానం పంపామనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. ప్రజారాజ్యం పేర ఇప్పటి వరకు పార్టీ రిజిష్టర్ కాలేదని కూడా స్పష్టం చేసింది. అయితే చెన్నక్రిష్ణయ్య దరఖాస్తును ప్రాసెస్ చేశామని ఎన్నికల సంఘం అధికార వర్గాలు చెప్పాయి.

చెన్నక్రిష్ణయ్య ఇంటికి చిరంజీవి అభిమానులు వెళ్లి ఆరా తీయడానికి ప్రయత్నించారు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో చెన్నక్రిష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ రిజిష్ట్రేషన్ కు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అంటున్నారు.

కాగా, చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. చిరంజీవి తన పార్టీ పేరు నమోదుకు ఈ నెల 26వ తేదీన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పార్టీ నమోదుకు 100 మంది సంతకాలు కావాల్సి ఉండగా 88 మంది సంతకాలతోనే ఆయన దరఖాస్తును ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు సమాచారం. తన లక్కీనెంబర్ 8 కావడంతో ఆయన ఇలా చేసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+