చిరు వైపు లోక్ సత్తా అడుగులు
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు కోసం జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా చూస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ఇచ్చిన సామాజిక న్యాయం, అవినీతి రహిత సమాజ స్థాపన నినాదాలు తమ పార్టీ లక్ష్యాలకు దగ్గరగా ఉండడంతో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన పార్టీ ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
కాగా, జయప్రకాశ్ నారాయణ్ మాత్రం జాతీయ పార్టీతో పొత్తు గురించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీతో పొత్తు వల్ల తమ రాజకీయ లక్ష్యాలను సాధించడం సులభం అవుతుందని ఆయన అంటున్నారట. కాగా, తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి కూటమితో పని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సాగుతోందట. అయితే, చిరంజీవి పార్టీ కొత్తగా ఏర్పడడం వల్ల ఈ పార్టీతో పొత్తు వల్ల పెద్దగా సమస్యలు రాబోవనే వాదన పార్టీలో వినిపిస్తోందని సమాచారం.












Click it and Unblock the Notifications