తెరాస ఎమ్మెల్యే అనర్హత కేసు మూసివేత
న్యూఢిల్లీ: తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం మూసేసింది. పార్టీ విప్ ను ధిక్కరించిన తమ పార్టీ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి జాప్యం చేస్తున్నారని అంటూ వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఏడాది క్రితం అప్పటి తెరాస శాసనసభా పక్ష నేత విజయరామారావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
విప్ ధిక్కరించిన తెరాస సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయాన్ని శాసనసభ స్పీకరు నిర్ణయానికే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో స్పీకర్ సముచిత రీతిలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది. తెరాసకు చెందిన 9 మంది శాసనసభ్యులు పార్టీ విప్ ధిక్కరించి రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటేశారు. దీంతో వారిపై చర్య తీసుకోవాలని తెరాస శాసనసభా పక్షం స్పీకర్ కు వినతిపత్రం సమర్పించింది. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా స్పీకర్ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications