బ్యాంకు ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం - కండీషన్స్ అప్లై..!!
పొదుపు చర్యల్లో భాగంగా బ్యాంకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నారు. వారంలో రెండు రోజులు ఎంపిక చేసిన సేవా విభాగాల్లోని ఉద్యోగులకు ఈ నిబంధన తొలుత అమలు చేయా లని నిర్ణయించారు. హైబ్రీడ్ మోడల్ లో అమలుకు బ్యాంకు యాజమాన్యం నిర్ణయించింది. కాగా.. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత పూర్తి స్థాయిలో విస్తరణ దిశగా బ్యాంకు యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది.
ప్రధాని మోదీ ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రధాన బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేయనుంది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా పొదుపు మంత్రం పాటించాలని.. కార్పోరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ తో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పోరేట్ బ్యాంకింగ్ కు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని.. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తామని వెల్లడించింది.

ప్రయోగాత్మకంగా అమలు.. వీరికే వర్తింపు
ఆ తరువాత సంస్థ పని తీరును సమీక్షించి.. ఈ విధానం మున్ముందు కొనసాగించాలా లేదా అనే అంశం పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. బ్యాంకులో అంతర్గత విభాగాలైన ట్రెజరీ ఆప రేషన్స్.. బ్యాంకు లావాదేవీలు.. డిజిటల్ బ్యాంకింగ్.. హెచ్ఆర్ డిపార్ట్ మెంట్, ఫైనాన్స్ - అకౌంట్స్ వంటి ఉద్యోగులకు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోం వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాదారులతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగుల విధులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డిఎఫ్‌సి యాజమాన్యం స్పష్టం చేసింది. వర్క్ ఫ్రం హోం వలన వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. ఈ బ్యాంకు లో ఈ విధానం అమలు సఫలం అవుతే.. ఇతర బ్యాంకులు సైతం ఇదే మార్గంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications