ఆర్ధిక తుఫాన్ లో దేశాన్ని వదిలేసి ఇటలీలో రీల్సా ? మోడీపై రాహుల్ ఫైర్..!

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ దేశంలో విపత్కర పరిస్ధితులు రాబోతున్నాయని, పొదుపు చర్యలు పాటించాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు యూరప్ టూర్ లో బిజీగా ఉన్నారు. అదీ రోజుకో దేశం తిరుగుతూ అక్కడి నేతల్ని కలుస్తున్నారు. ఏమైనా పెట్టుడులు వస్తున్నాయా, ఒప్పందాలు కుదురుతున్నాయా అంటే అదీ లేదు. ఇవాళ అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఇండియా నుంచి తీసుకెళ్లిన మెలోడీ చాక్లెట్లు ఇచ్చారు ప్రధాని మోడీ. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోడీ..! ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ ఇదే..!
మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోడీ..! ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ ఇదే..!

ఇదే క్రమంలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ప్రధాని మోడీ (PM Modi) తీరుపై విమర్శలు గుప్పించారు. మన తలలపై ఆర్థిక తుఫాను చెలరేగుతుంటే, మన ప్రధానమంత్రి ఇటలీలో మిఠాయిలు పంచుతూ బిజీగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ కన్నీరు పెడుతున్నారని రాహుల్ గుర్తుచేశారు. కానీ ప్రధాని నవ్వుతూ రీళ్లు తీస్తుండగా, బీజేపీ వాళ్లు చప్పట్లు కొడుతున్నారన్నారు. ఇది నాయకత్వం కాదు, ఒక ప్రహసనం అని తెల్చేశారు.

Rahul Gandhi Slams PM Modi for Gifting Candies in Italy Amid Economic Crisis Gripping India

త్వరలో అతిపెద్ద ఆర్ధిక తుఫాన్ ..! సిద్ధమైపోండి - రాహుల్ హెచ్చరికలు..!
త్వరలో అతిపెద్ద ఆర్ధిక తుఫాన్ ..! సిద్ధమైపోండి - రాహుల్ హెచ్చరికలు..!

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే సాధారణ జనానికి పొదుపు చర్యలు పాటించాలని చెప్పిన ప్రధాని మోడీ.. ఇలా తాను వరుసగా విదేశీ ప్రయాణాలు చేస్తుండటం, అదీ దేశంలో ఆర్దిక సంక్షోభం నెలకొన్న తరుణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై దృష్టిసారించపోవడం సరికాదని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే బీజేపీపై రాహుల్ విమర్శలు కొత్తేమీ కాదని బీజేపీ .. ప్రధాని మోడీని సమర్దించుకుంటోంది. మరోవైపు ఇవాళ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 97 రూపాయలకు చేరుకోవడం, అలాగే ప్రధాని మోడీ ఇటలీ ప్రధానికి ఇచ్చిన చాక్లెట్ కంపెనీ షేర్లు 5 శాతం పెరగడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+