చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. గుంటూరులో తలపెట్టిన యువగర్జన సదస్సుపై బాలకృష్ణ చంద్రబాబుతో మాట్లాడినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గుంటూరులో సెప్టెంబర్ 19వతేదీన గానీ, అక్టోబర్ లో గానీ యువ సదస్సు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉందని బాలకృష్ణ ఈ సదస్సు ద్వారా తెలియజేయనున్నట్లు సమాచారం. అలాగే తన రాజకీయ రంగప్రవేశం గురించి గురించి కూడా ఈ సభలో ఆయన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటులందరూ ఈ సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలువాలని బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సినీ హీరోలు నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications