రైతు సమస్యలపై ప్రభుత్వంపై దాడి
హైదరాబాద్: రైతు సమస్యలపై ప్రతిపక్షాలు సోమవారం శాసనసభలో ప్రభుత్వంపై దాడికి దిగింది. ఎరువులు, గిట్టుబాటు ధరలు, విద్యుచ్ఛక్తి సమస్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ ను లక్ష కోట్ల రూపాయలకు పెంచామని చెబుకుంటున్న ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధరలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుగుదేశం సభ్యుడు విమర్శించారు. వ్యవసాయ దిగుబడులు పెరిగితే బియ్యం ధర ఎందుకు పెరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కరెంట్ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ఇది రైతుల ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
