Bigg Boss 10 Day 1: బిగ్ బాస్ 10లో బిగ్ ట్విస్ట్: సీక్రెట్ టాస్క్‌లు..అసలైన 'మహా పరీక్ష' షురూ!

Bigg Boss 10 Day 1: బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజే బీభత్సం జరిగింది. తొలి రోజే ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న 16 మందిలో ఆల్రెడీ 8 మందికి మ్యాజికల్ కీస్ దొరికాయి. కానీ ఇంకా ఇద్దరి రెండు కీస్ రావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. ఈ వారం అంతా కూడా మహా పరీక్ష అని.. వచ్చేవారంలో చాలా మంది ఇంట్లోంచి వెళ్లిపోతారు.. మీరు ఇంకా హౌస్ మేట్స్ కాలేదు.. అని బిగ్ బాస్ హెచ్చరిక జారీ చేస్తాడుయ మ్యాజికల్ కీ సాధించిన 8 మంది కలిసి ఓ ఇద్దరిని ఎంచుకోవాలని బిగ్ బాస్ అంటాడు. అందరూ కలిసి వంశీ, కృష్ణుడులకు ఆ పవర్ కీస్ ఇస్తారు. అయితే తమకు ఎందుకు ఇవ్వలేదని కొందరు హౌస్ మేట్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అక్కడ స్వల్పంగా గొడవలు చెలరేగాయి. చివరకు వంశీ, కృష్ణుడు వెళ్లి తమ కీస్ తీసుకున్నారు. ఆ పవర్ కీస్ దక్కుంచుకున్న 10 మందికి మాత్రమే బెడ్రూం యాక్సెస్ లభించగా.. మిగిలిన కంటెస్టెంట్లు బయటే పడుకోవాల్సి వచ్చింది.

యాంకర్.. Bigg Boss లో నయా అవతార్
యాంకర్.. Bigg Boss లో నయా అవతార్

దేబ్జానీ మోదక్ నాగార్జున ఇచ్చిన 18 బ్యాడ్జీల బాక్సును చూసుకుంటూ ఎవరికి ఏది ఇవ్వాలనే దానిపై ఆలోచనలో పడింది. మరోవైపు సుధీర్ రెడ్డి, కొందరు సభ్యులు త్రిగుణ్ అందరినీ డామినేట్ చేస్తున్నాడని చర్చించుకున్నారు. ఉదయం ఏషనాగుల సాంగ్ తో హౌస్ మేట్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ రోజును ప్రారంభించారు. రాంప్రసాజ్-దేబ్జానీ అన్నాచెల్లెళ్లుగా భావించుకుంటూ కాసేపు ఎమోషనల్ అయ్యారు. దేబ్జానీ మైక్ బ్యాటరీ మార్చుకోవడం మర్చిపోవడంతో బిగ్ బాస్‌ను సరదాగా కాకా పట్టడం క్యూట్ గా అనిపించింది. అలాగే త్రిగుణ్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్(దెయ్యాలు ఉన్నాయని నమ్మించడం) పనిలో బిజీగా ఉండగా.. సుధీర్ రెడ్డి సృష్టితో ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

Bigg Boss 10 Telugu Day 1 Highlights Power Keys Distribution Special Powers Fights and Team Leaders

బిగ్ బాస్ ఆదేశాల మేరకు పవర్ కీస్ గెలుచుకున్న 10 మంది తమ పవర్ బాక్సులను ఓపెన్ చేసి తమకు లభించిన పవర్స్ ఏంటో తెలుసుకున్నారు.

త్రిగుణ్: వేరే ప్లేయర్ తన పవర్ వాడినప్పుడు త్రిగుణ్ తన పవర్ ఉపయోగించి దాన్ని లాగేసుకోవచ్చు(తీసుకున్న పవర్ వెంటనే వాడాలి).

ఝాన్సీ: ఈ పవర్ వాడి ఎలిమినేషన్ నుంచి సేవ్ కావచ్చు.(అంటే ఈ వారం సేవ్ అయినట్లే).

నీహార్ ముకేష్ గౌడ: వేరే వాళ్ల పవర్ వాడేసిన తర్వాత, వారికి ఆ పవర్ మళ్లీ ప్రసాదించవచ్చు.

వర్షిణి: బిగ్ బాస్ హౌస్‌లో ఏ ప్లేయర్ టాస్క్ గెలిచినా ఆ గెలుపును తనకు కావాలనుకున్నప్పుడు సొంతం చేసుకోవచ్చు.

కృష్ణుడు: ఎలిమినేషన్ సమయంలో తప్ప ఏ సమయంలోనైనా ఏ ప్లేయర్ ప్లేస్‌నైనా లేదా ఇద్దరినీ స్వాప్ చేయవచ్చు.

షాలిని: ఏ ప్లేయర్ కైనా తనకు నచ్చిన హౌస్ డ్యూటీని కేటాయించవచ్చు.

సృష్టి: ఏ ప్లేయర్‌నైనా డైరెక్ట్ నామినేట్ చేయవచ్చు.

రాంప్రసాద్: నామినేషన్లో రాంప్రసాద్ లేదా తనకు నచ్చిన వాళ్లను సేవ్ చేయవచ్చు.

టెంపర్ వంశీ: ఏ ప్లేయర్ నైనా రెండు వారాల పాటు కెప్టెన్సీకి అర్హత లేకుండా చేయవచ్చు.

నరేష్: నామినేషన్స్ లో తన ఓటు విలువ రెండు రెండు రెట్లు ఉంటుంది. (ఈ సందర్భంగా బిగ్ బాస్ నరేష్ తో సరదాగా ఆడుకున్నారు).

Bigg Boss హౌస్ లోకి జబర్దస్త్ స్టార్- రచ్చ రచ్చే
Bigg Boss హౌస్ లోకి జబర్దస్త్ స్టార్- రచ్చ రచ్చే

పవర్స్ అన్నీ చూసుకున్న తర్వాత కీస్‌ను స్టోర్ రూంలోని ట్రేలో పెట్టాలని బిగ్ బాస్ సూచించారు. పవర్ వాడాలంటే ముందుగా బిగ్ బాస్ కు చెప్పి కీ తీసుకోవాలి. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ మహా పరీక్ష ప్రారంభమవుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. హౌస్ మేట్స్ గా మారడానికి అందరూ రెండు జట్లుగా విడిపోవాలని, దానికి ఇద్దరు లీడర్లను ఎన్నుకోవాలని ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియలో రోహిత్ మెజారిటీ ఓట్లతో ఒక లీడర్‌గా ఎంపికయ్యారు. అయితే త్రిగుణ్, రాంప్రసాద్ మధ్య టై కావడంతో త్రిగుణ్ తన లీడర్ స్థానాన్ని రాంప్రసాద్ కు ఇచ్చారు.

రోహిత్ వర్సెస్ త్రిగుణ్ గొడవ
లీడర్ల ఎంపిక సమయంలో అగ్ని పరీక్ష సభ్యులంతా గ్రూపుగా మారి రోహిత్ ను లీడర్ గా ఎన్నుకున్నారని త్రిగుణ్ ఆరోపించారు. దీంతో అగ్ని పరీక్ష సభ్యులకు, త్రిగుణ్‌కు మధ్య గొడవ జరిగింది. త్రిగుణ్ ఎన్ని పాయింట్లు చెప్పినా వాళ్లు అంగీకరించలేదు. చివరకు బిగ్ బాస్ రాంప్రసాద్ కు బ్లూటీమ్, రోహిత్ కు రెడ్ టీమ్ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు టీమ్స్ లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు. ఎలాంటి టాస్కులు జరగబోతున్నాయనేది తాజా ఎపిసోడ్‌లో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+