చిరులో ఆత్మవిశ్వాసం లేదు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం తామేనని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నాయకులు కార్యాలయంలో కూర్చుని కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చిరంజీవిపై మొదటిసారి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శలు చేశారు. చిరంజీవి తన బలహీనతలను తానే బయట పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప మరెక్కడా గెలవలేమని వారే చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. చిరంజీవికి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి ఇంట్లో కూర్చుని ఏవేవో ఊహించుకుని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వార్థపరులు పార్టీ పెడితే మార్పు రాదని ఆయన అన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వ అవినీతిని అరికడితే ప్రజాసమస్యలన్నీ పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము వేసే ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని ఆయన అన్నారు. శాసనసభను ఎదుర్కోనే ధైర్యం కాంగ్రెసుకు లేదని, దాంతో పారిపోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నామని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రారాజుగా వ్యవహరిస్తున్నారని, స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఐటి గొప్పతనమంతా తమదేనని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+