భార్యాపిల్లలను దహనం చేసిన వ్యక్తి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు పిల్లలను సజీవ దహనం చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బొల్లం చంద్రయ్య అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం రేణుక అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు.
చంద్రయ్య రేణుకను అనుమానంతో నిత్యం వేధిస్తూ వచ్చాడు. భార్యను చంపి మరో పెళ్లి చేసుకోవాలని తలపోశాడు. దీంతో సోమవారం రాత్రి రేణుకపై, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కలకలం రేగడంతో బయట పడుకున్న రేణుక తండ్రి తలుపు తట్టి లోనికి వెళ్లాడు. ఆ సమయంలో చంద్రయ్య పారిపోయాడు.












Click it and Unblock the Notifications