కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్ప పీడన ద్రోణి వల్ల వచ్చే 48 గంటల్లో కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరానికి వాయవ్య దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ద్రోణి వల్ల తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications