విద్యార్థి హత్య: నిజామాబాద్ బంద్
నిజామాబాద్: న్యూప్రియదర్శిని పాఠశాలల ఏడో తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థి హత్యకు నిరసనగా బుధవారంనాడు నిజామాబాద్ జిల్లా బంద్ జరిగింది. వివిధ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. మహేష్ ను పాఠశాల గదిలో సజీవదహనం చేశారు. పాఠశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బంద్ సందర్భంగా జిల్లాలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. మంగళవారం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications