మంత్రి ఊరిలో ఘర్షణ: ముగ్గురు మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా చినమేరంగి గ్రామంలో కాంగ్రెసులోని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మంగళవారం రాత్రి గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఈ ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో ఇతర మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఇది మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత గ్రామం కావడం విశేషం.
ప్రభుత్వ పథకాలు ఒక వర్గానికే మంజూరవుతున్నాయని భావిస్తూ వస్తున్న మరో వర్గం దాడికి దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విష్ణుకాంతుల, నాయుడు, రాములు అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఘర్షణలో మరణించారు.












Click it and Unblock the Notifications