అఖిల పక్ష రైతు నేతల అరెస్టు
అనంతపురం: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీకి వినతి పత్రం సమర్పించడానికి బయలుదేరిన అఖిల పక్ష రైతు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అనంతపురం జిల్లా గుత్తి వద్ద గురువారంనాడు అరెస్టు చేశారు. ఎరువుల కొరత, తదితర రైతు సమస్యలపై వారు సోనియా గాంధీకి వినతిపత్రం సమర్పించడానికి అనంతపురం బయలుదేరారు.
సోనియా గాంధీ అనంతపురంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో రైతు నేతలు అక్కడికి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అక్కడి దాకా చేరుకోనీయలేదు. రైతు నేతలను అరెస్టు చేసి ప్రభుత్వం వాస్తవాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాదులో విమర్శించారు.












Click it and Unblock the Notifications