ముంబయి: మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి(29) ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కుతోంది. ముంబై అంధేరి లోని ఐటీసీ గార్డెన్స్ లో ఈ రోజు వివాహ నిర్చితార్ధం జరిగింది. పెళ్ళికుమారుడు మరెవరో కాదు...ఫ్రాన్స్ రాజకుమారుడు టెల్లి(36). న్యూయార్క్ కి చెందిన ఆయన ఫైనాన్సియల్ ఎనాలిస్ట్ గా పనిచేస్తున్నారు. అతను కుటుంబం మొత్తం కొంత కాలంగా బిజెనెస్ లో ఉన్నారు. ఈ నిర్చతార్ధ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు,ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే ఘనంగా పెళ్ళి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 1999లో మిస్ వరల్డ్ గా ఎంపికయిన ఆమె తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించింది గానీ విజయం సాధించలేదు. జూన్ లో రిలీజైన మేమ్ సాబ్ సినమా భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాలని ఇచ్చింది.