క్షతగాత్రుడి మృతి: రుయాలో ఉద్రిక్తత
తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో క్షతగాత్రుడి మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భాస్కర్ అనే వ్యక్తి రుయా ఆస్పత్రిలో మరణించాడు. అయితే తగిన సమయంలో వైద్యం అందకపోవడం వల్లనే మరణించాడని భాస్కర్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రికి వచ్చిన మూడు గంటలకు కూడా వైద్యం అందించలేదని, దాని వల్లనే భాస్కర్ మరణించాడని ఆరోపిస్తూ వైద్యులపై వారు విరుచుకుపడ్డారు.
ఆందోళనకు దిగిన భాస్కర్ బంధువులపై జూనియర్ డాక్టర్లు తిరగబడ్డారు. ఆందోళనకారులను వారు తరిమి కొట్టారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో రుయా ఆస్పత్రిలోని రోగులు కూడా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications