కమిడెయిన్ వడివేలు ఇంటిపై దుండగుల దాడి

చెన్నై: తమిళనాట పాపులర్ కమెడియన్ అయిన వడివేలు సాలిగ్రామంలోని ఆఫీసు,ఇంటిపై ఈరోజు దాడి జరిగింది. దాదాపు 50 మంది గల గుంపు ఒక్కసారిగా రాళ్ళు విసురుతూ దాడిచేసారు. పోలీసులు చెప్పే దాని ప్రకారం ఆ గ్యాంగ్ లోని ఓ ఇరవై మంది టూ వీలర్స్ పైనా, మిగిలిన వారి ఐదు ఆటోరిక్షాలపైనా వచ్చారు. వారంతా ఒక్కసారిగా దాడిచేయటంతో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. కొద్ది మందికి గాయాలయ్యాయి.

అయితే వడివేలు మాత్రం క్షేమంగా బయిటపడ్డారు. ఆయన మీడియాతో ఈ సంఘటన గూర్చి మాట్లాడుతూ మధ్యాహ్నం వచ్చిన ఆ గ్యాంగ్ వారు సెక్యూరిటీ వారిని కొట్టి వడివేలు వివరాలు అడగారు. తర్వాత రాళ్ళు విసరటం ప్రారంభించారు.లోపల ఉన్న ఒక వ్యక్తికి గాయాలైతే ఆసుపత్రికి పంపటం జర్గింది. కొంత ఫర్నిచర్ డామేజ్ అయింది.

ఆ సమయంలో వడివేలు ఇంటిలోనే ఉన్నారు. ఈ విషయమై ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైయింట్ ఇవ్వటం జరిగిందన్నారు. అయితే శనివారం సిటీ కోర్టులో గతంలో తనపై జరిగిన దాడి ఫైనల్ హియిరింగ్ వచ్చిందని దానికీ ఈ సంఘటనకూ సంభందం ఉందా అన్న కోణంలో కేసును పరిశీలుస్తున్నామన్నారు. ఆ కేసులో నటుడు విజయ్ కాంత్ కూ సంభంధం ఉండంటం పలు అనుమానాలుకు తావిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+