'నారాయణ' గుర్తింపు రద్దు చేయాలి: ఎబివిపి
హైదరాబాద్: విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి మృతికి కారణమైన నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళన చేశారు.
ఉన్నత విద్యామంత్రి చెంగారెడ్డి దిష్టిబొమ్మను దగ్థం చేశారు. నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. నారాయణ కళాశాలలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్ధి మరణించడం, అనేక మంది గాయపడడం తెలిసిందే. శనివారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా నేడు హైదరాబాద్ లోని అన్ని విద్యాసంస్ధలను విద్యార్ధి సంఘాలు బంద్ చేయించాయి.












Click it and Unblock the Notifications