చైనా: కల్తీపాలపొడితో 12 వేలమందికి అస్వస్ధత
బీజింగ్: చైనాలో కల్తీ పాలపొడితో అస్వస్థులవుతున్న చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 12వేలమందికి పైగా చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 104 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా ఆరోగ్యశాఖను ఉటంకిస్తూ జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది.
ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా 39,965 మంది చిన్నారులు కల్తీ పాలపొడితో అస్వస్థులయ్యారు. బైలనూ కంపెనీకి చెందిన పాలపొడిలో ప్లాస్టిక్‌లో ఉపయోగించే మెలమిన్ వాడటంతో ఇలా వేలసంఖ్యలో చిన్నారులు అస్వస్థులవటం, ఎందరో మరణించటం జరగుతోంది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications