అమృతసర్ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు జరిపారు. భారత్-అమెరికా అణు ఒప్పందంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అంతకు ముందు ఆయన జలియన్‌వాలాబాగ్ స్మారక చిహ్నాన్ని సందర్శించిన స్వాతంత్రపోరాటంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పించారు.