హైదరాబాద్: టీడీపీ పౌలిట్‌బ్యూరో సమావేశం ఈరోజు హైదరాబాద్‌లో జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణా అంశంపై ఈరోజు ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చిరు పార్టీ గురించి, వలసల గురించి, అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది. చిరంజీవి పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో వలసపోవడం తెలిసిందే.