వుడా భూముల వేలం: ఉద్రిక్తత
విశాఖపట్నం: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపట్టిన భూముల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. గురువారంనుంచి మూడురోజులపాటు విశాఖ నగరాభివృద్ధి సంస్థ స్థలాల వేలం నిర్వహిస్తోంది. మధురవాడలోని 18 ఎకరాల లేఔట్‌లోని స్థలాన్ని చిన్నచిన్న లేఔట్లుగా విభజించి వేలానికి ఏర్పాట్లు చేసింది.
వేలంపాటను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వేలం జరుగుతున్న చిల్డ్రన్ థియేటర్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారు. ఆ చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఈ ఆందోళనలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications