తెరాసవారు టెర్రరిస్టులు: లగడపాటి

విజయవాడ: తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఏ పనీ చేయలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. దురుద్దేశపూరితంగానే తెలంగాణ రాష్ట్ర నాయకులు తనపై నిజామాబాద్ సంఘటనను రుద్దారని ఆయన శుక్రవారం ఆరోపించారు. వారి ప్రయత్నాలు ఎదురు తిరిగాయని ఆయన అన్నారు. తెరాసవారు తెలంగాణవాదులు కారని, ఆటంకవాదులు, టెర్రరిస్టులు అని ఆయన అన్నారు.

తెరాస నాయకులకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ అంటే తెరాస కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నచ్చజెప్పడం వల్లనే తాను నిజామాబాదులో తలపెట్టిన ధర్నాను విరమించుకున్నట్లు ఆయన తెలిపారు. చెడుకు, మంచికి మధ్య జరిగిన వివాదమని, మానవత్వానికి ఉన్మాదానికి మధ్య జరిగిన గొడవ అని అన్నారు. జరిగిన సంఘటనను తనపై రుద్దటం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రజల భావోద్వేగాలను వాడుకోవడానికి తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+