ల్యాంకోపై దాడి: సిఐ శంకర్ రెడ్డి బదిలీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హిల్స్ కార్యాలయంపై దాడి వ్యవహారంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) శంకర్ రెడ్డి బదిలీకి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడిని ఆపడంలోనూ, దాడి బాధ్యులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంలోనూ విఫలమైన ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
సచివాలయంలో ఆయన శుక్రవారం ఉదయం ల్యాంకోపై జరిగిన దాడి వ్యవహారంపై సమీక్షించారు. దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయంలో జరిగిన శిక్షణా శిబిరం వద్ద ఉన్న నిఘా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్ల దాడిని నివారించలేకపోయినట్లు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications