బెంగళూరు పేలుళ్ళ నిందితుడి అరెస్టు
బెంగళూరు: బెంగళూరు వరుస బాంబు పేలుళ్ళ కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. సెప్టెంబర్ 15 న పోలీసులు అదుపులోకి తీసుకున్న అబ్దుల్ సామి ఇంటరాగేషన్ లో అనేక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. పేలుళ్ళలో అతని పాత్ర ఎంత వరకు ఉందోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సామి బీజపూర్ లో చదువుకుంటున్నాడు. బెంగుళూరు పేలుళ్ళ సమయంలో అతను ఇక్కడే ఉన్నాడు. వరుస పేలుళ్ళ వెనుక కీలక సూత్రధారి, ప్రముఖ ఇండియన్ ముజాహిదీన్ అబ్దుస్ సుభాన్ తో సామి కన్పించినట్టు పోలీసులు చెబుతున్నారు. సుభాన్ ఇప్పుడు పాకిస్ధాన్ లో తలదాచుకున్నాడు.
సుభాన్ కోసం పోలీసులు గాలిస్తున్నందువల్ల ఇండియన్ ముజాహిదీన్ ఆర్ధిక వ్యవహారాలను సామికి అప్పగించినట్టు తెలుస్తోంది. సామి అరెస్టును శుక్రవారం పోలీసులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు మడివాలలో జరిగిన పేలుడు వెనుక సామి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మడివాలా బాంబు పేలుడులో ఒక మహిళ మరణించింది.












Click it and Unblock the Notifications
