సాఫ్ట్ వేర్ కంపెనీ సిఇవోపై దాడి
నోయిడా: ఇటాలియన్ కంపెనీకి చెందిన భారతీయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో)ని కంపెనీ మాజీ ఉద్యోగులు కొట్టి చంపిన నాలుగు రోజులకే నోయిడాలో మరో కంపెనీ సీఈవోను అగంతకుల దాడిలో తీవ్రంగా దెబ్బలు తిన్నారు. అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో కాశీర్ ద్వివేది నిన్న రాత్రి కారులో ఆఫీసు నుంచి వెళ్తుండగా, కొందరు వ్యక్తులు మరో వాహనంలో వెంబడించి ఆయన కారును చుట్టుముట్టి ఇనుప రాడ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. ఆయనను బయటకు లాగి తీవ్రంగా కొట్టారు.
దాడికి పాల్పడినది ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపులు అధికంగా ఉన్నందువల్ల అటువంటి వారే సి ఇవోల మీద దాడులకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
