పేలినవి టిఫిన్ బాక్స్ బాంబులే
న్యూఢిల్లీ: ఢిల్లీ మహ్రౌలి ప్రాంతం జీహాద్ మహల్ పూల మార్కెట్ లో పేలింది టిఫిన్ బాక్స్ బాంబేనని పోలీసులు దాదాపు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిముషాలకు పేలుడు సంభవించింది. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు టిఫిన్ బాక్సులను అక్కడ వదిలి వెళ్ళినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ పేలుడులో మరణించిన ఐదుగురిలో ఒక తల్లి, చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది.
బాంబు పేలుడు శబ్దం కిలోమీటర్ పరిధిలో విన్పించింది. పూల మార్కెట్ ప్రాంతం శనివారం రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్లుగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పూల మీర్కెట్ లోని ఒక ఎలక్ట్రానిక్ షాపులో రెండు నల్ల బ్యాగులలో టిఫిన్ బాక్స్ బాంబులను ఉగ్రవాదులు వదిలి వెళ్ళారు.












Click it and Unblock the Notifications
