చందర్లపాడు ఎమ్మార్వో ఆఫీసు ముట్టడి
నందిగామ: రైతుల సమస్యలపై వరుసగా ఆందోళనలు నిర్వహిస్తున్న టీడీపీ ఈరోజు సుబాబుల్ మద్దతు ధరపై ఆందోళన చేపట్టింది. ఈ ప్రాంతంలో రైతులు సుబాబుల్ను అధికంగా సాగు చేస్తుంటారు. వీరికి మద్దతు ధర లేక నష్టపోతున్నారు. దీంతో మద్దతు ధర ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులు శనివారం చందర్లపాడు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావు నందిగామ నియోజకవర్గంలో తరచుగా రైతు సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. ఆయనకు రైతుజనంలో మంచి పలుకుబడి ఉండడంతో ఆయన ఆందోళన లేవనెత్తినప్పుడల్లా అధికారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.












Click it and Unblock the Notifications
